20, జూన్ 2009, శనివారం

తెలుగువారి ఆత్మగౌరవం గురించి అన్నగారు గొన్తెతీఁ అరవకముందు ,మనదేశంలో తెలుగువారి స్తితి ,స్థానం ఎక్కడుందేదో,ఎలా ఉండేదో యిప్పటితరానికి బాగా తెలియక పోయినా ఆనాటితరం వారికి బాగా జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఆరోజుల్లో మనతెలుగువారి స్తితి ఉత్తరదేసంలో ఎలా ఉన్దేదోతెలియచేప్పే నవలలోని సన్నివేశం నాకెప్పుడూ గుర్తుకోస్తుంటుంది .
నవల రాసింది, సమకాలీన పరిస్తితుల్ని తనరచనల్లో హాస్య వ్యంగ్యోక్తులతో రంగరించి చెప్పే శ్రీ యర్రంసెట్టి శాయి గారు .
ది మిత్రులు కుటుంభాలతో ఆనవలలో కథ ప్రకారం కొంతమంత్తరదేశ యాత్ర వెళతారు .అక్కడ ఒక యాత్రా స్తలంలో సభ్యులంతా సత్తరువులో వుండగా ముగ్గురు మాత్రం షాపింగుకి వెళతారు షాపు యజమాని "మీరు మదరాసీలుకదూ " అంటు పలకరిస్తాడు. అప్పుడు హీరో "తామూ మదరాసీలు కాదని ,తాము తెలుగువారమని దక్షిణ భారతంలో ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాస్త్రముందని,అక్కడ తెలుగు మాట్లాడతారని"చెపుతాడు.అపుడు షాపు యజమాని "అల్లగా, రాస్త్ర్హంలో మీరు ముగ్గురేన ఇంకెవరయినా ఉంటారా?"అంటు అమాయకంగా అడుగ్తాడు.ఇది ఆనాటి మన తెలుగువారి పరిస్తితి. తరువాత అన్నగారు, ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీ తెలుగు ప్రజల ఖ్యాతిని తెలుగుతల్లి వెలుగుని ఎంత ఎత్తుకు తీసుకేల్లాయో మన అందరికీ తెలుసు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి