12, జూన్ 2009, శుక్రవారం

కలలు



"కలలు కనండి, సాకారం చేసుకోండి" .ఇది మన మాజీ రాష్ట్రపతి అబ్డ్లుల్ కలాం గారి ప్రవచనము .ప్రతీ మనిషికి కలలు అనేవి తప్పకుండా వుంటాయి .శక్తికి మించి కలలు కనేవారు అనేకమంది.కాని పరిమితమయిన కలలుకని వాటిని సాకారం చేసుకొనే అవకాశాలు ఒనరులు ఉండీ ,జీవితంలో వాటిని నిజం చేసుకో లేక కలలు కల్లలు గానే మిగిలి పొగా నిరాశా నిస్పృహల తో మిగిలి పోయేవారు చాలా అరుదుగా వుంటారు .
అలాంటివారిలో నేను ప్రధముడిని .
నేనొక ప్రభుత్వ సంస్తలో చిన్న వుద్యోగిని .భార్యతెచిన కొద్దిపాటి ఆస్తి యిద్దరుపిల్లలు చిన్నకుటుంభం
నా కలలను సాకారం చేసుకోవటం చాలా సులువు .
కానీ ,నా నిబద్దతలేని జీవితం ప్రణాళిక లేని ఆర్ధిక విధానం ,దుర్వసనాలు జీవితబాగాస్వామి సహకారంలేనితనం
నా కలలు కల్లలు గానే మిగిలిపోయాయి
గాడి తప్పిన జీవితాన్ని గాదిమీదపెడుతున్న సమయంలో హఠాత్తుగా కాటేసిన ఆరోగ్యం.
అది జీవితంలో పెద్ద దురదృష్టం
ఉద్యోగ విరమణ చేసిన నేను గడిచిన జీవితాన్ని ,సాకారం కాని కలలను చేసిన తప్పులను తలచుకుంటూ కుమిలి పోవటం తప్ప చేయగలిగిందేముంది
ఇంతకూ నా కలలేమితో మీకు చెప్పలేదు కదూ?
పదవీ విరమణ తరువాత ఊరి బయట ఒక చిన్న ఇల్లు కట్టుకొని యింటి బయట తోటలో సాయత్రం భార్యతోకుర్చీలువేసుకొని కూర్చోవాలని ,తిరగటానికి ఒక చిన్న కారు కావాలని.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి