20, జూన్ 2009, శనివారం

తెలుగువారి ఆత్మగౌరవం గురించి అన్నగారు గొన్తెతీఁ అరవకముందు ,మనదేశంలో తెలుగువారి స్తితి ,స్థానం ఎక్కడుందేదో,ఎలా ఉండేదో యిప్పటితరానికి బాగా తెలియక పోయినా ఆనాటితరం వారికి బాగా జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఆరోజుల్లో మనతెలుగువారి స్తితి ఉత్తరదేసంలో ఎలా ఉన్దేదోతెలియచేప్పే నవలలోని సన్నివేశం నాకెప్పుడూ గుర్తుకోస్తుంటుంది .
నవల రాసింది, సమకాలీన పరిస్తితుల్ని తనరచనల్లో హాస్య వ్యంగ్యోక్తులతో రంగరించి చెప్పే శ్రీ యర్రంసెట్టి శాయి గారు .
ది మిత్రులు కుటుంభాలతో ఆనవలలో కథ ప్రకారం కొంతమంత్తరదేశ యాత్ర వెళతారు .అక్కడ ఒక యాత్రా స్తలంలో సభ్యులంతా సత్తరువులో వుండగా ముగ్గురు మాత్రం షాపింగుకి వెళతారు షాపు యజమాని "మీరు మదరాసీలుకదూ " అంటు పలకరిస్తాడు. అప్పుడు హీరో "తామూ మదరాసీలు కాదని ,తాము తెలుగువారమని దక్షిణ భారతంలో ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాస్త్రముందని,అక్కడ తెలుగు మాట్లాడతారని"చెపుతాడు.అపుడు షాపు యజమాని "అల్లగా, రాస్త్ర్హంలో మీరు ముగ్గురేన ఇంకెవరయినా ఉంటారా?"అంటు అమాయకంగా అడుగ్తాడు.ఇది ఆనాటి మన తెలుగువారి పరిస్తితి. తరువాత అన్నగారు, ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీ తెలుగు ప్రజల ఖ్యాతిని తెలుగుతల్లి వెలుగుని ఎంత ఎత్తుకు తీసుకేల్లాయో మన అందరికీ తెలుసు.

17, జూన్ 2009, బుధవారం

వర్షం


వర్శం: ప్రక్రుతి మనిషికి ప్రసాదించిన వరం .కాని, ఈ వర్షాన్ని రాజకీయం చేసి లబ్ది పొందాలనుకునేవారుఅనేకమంది .అందులో ముందువరుసలో వుండేవారు మనప్రియతమముఖ్యమంత్రి రాజసేకరరెడ్డి .ఆయన పాలనలోనే వర్షాలుకురుస్తాయని ,వరుణ దేవుడు తమ పార్తీవాడని ప్రతిపక్షాలుఅధికారంలోకి వస్తే వర్షాలు కురవవని నిస్సిగ్గుగా చెప్పే వ్యక్తీ మనముఖ్య మంత్రి .ఇటువంటి అభిప్రాయం మూదనమ్మకమ్కాదా?
రాజాన్గాబద్దముగా ఎన్నికయిన వ్యక్తీ ఇలాంటి ముడనమ్మకాలను
ప్రేరేపించ వచ్చా?ప్రజలను యింకా అగ్ననంలోకి నేత్తవచ్చ ?ఆలోసించండి.

12, జూన్ 2009, శుక్రవారం

కలలు



"కలలు కనండి, సాకారం చేసుకోండి" .ఇది మన మాజీ రాష్ట్రపతి అబ్డ్లుల్ కలాం గారి ప్రవచనము .ప్రతీ మనిషికి కలలు అనేవి తప్పకుండా వుంటాయి .శక్తికి మించి కలలు కనేవారు అనేకమంది.కాని పరిమితమయిన కలలుకని వాటిని సాకారం చేసుకొనే అవకాశాలు ఒనరులు ఉండీ ,జీవితంలో వాటిని నిజం చేసుకో లేక కలలు కల్లలు గానే మిగిలి పొగా నిరాశా నిస్పృహల తో మిగిలి పోయేవారు చాలా అరుదుగా వుంటారు .
అలాంటివారిలో నేను ప్రధముడిని .
నేనొక ప్రభుత్వ సంస్తలో చిన్న వుద్యోగిని .భార్యతెచిన కొద్దిపాటి ఆస్తి యిద్దరుపిల్లలు చిన్నకుటుంభం
నా కలలను సాకారం చేసుకోవటం చాలా సులువు .
కానీ ,నా నిబద్దతలేని జీవితం ప్రణాళిక లేని ఆర్ధిక విధానం ,దుర్వసనాలు జీవితబాగాస్వామి సహకారంలేనితనం
నా కలలు కల్లలు గానే మిగిలిపోయాయి
గాడి తప్పిన జీవితాన్ని గాదిమీదపెడుతున్న సమయంలో హఠాత్తుగా కాటేసిన ఆరోగ్యం.
అది జీవితంలో పెద్ద దురదృష్టం
ఉద్యోగ విరమణ చేసిన నేను గడిచిన జీవితాన్ని ,సాకారం కాని కలలను చేసిన తప్పులను తలచుకుంటూ కుమిలి పోవటం తప్ప చేయగలిగిందేముంది
ఇంతకూ నా కలలేమితో మీకు చెప్పలేదు కదూ?
పదవీ విరమణ తరువాత ఊరి బయట ఒక చిన్న ఇల్లు కట్టుకొని యింటి బయట తోటలో సాయత్రం భార్యతోకుర్చీలువేసుకొని కూర్చోవాలని ,తిరగటానికి ఒక చిన్న కారు కావాలని.